HomeTop StoriesSRH vs LSG: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ సూపర్‌ జెయింట్స్‌ హై ఓల్టేజీ మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన...

SRH vs LSG: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ సూపర్‌ జెయింట్స్‌ హై ఓల్టేజీ మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ

SRH vs LSG IPL 2026: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో హై ఓల్టేజీ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ 19లో తొలిసారిగా సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో తలపడుతోంది. ఆరెంజ్‌ ఆర్మీ నినాదాలతోతో స్టేడియం మొత్తం దద్దరిల్లుతోంది. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకోగా హైదరాబాద్‌ కెప్టెన్‌ ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/adilabad-news/bjp-won-khanapur-municipality-with-brs-support/

ఐపీఎల్‌ 2026లో ఎస్‌ఆర్‌హెచ్‌కి ఇది మూడో మ్యాచ్‌. మొదటి మ్యాచ్‌ ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక లఖ్‌నవూ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓడిపోగా, ఈ మ్యాచ్‌ ద్వారా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. 

ఇరు జట్ల ప్లేయింగ్‌ 11 ఇదే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌ & వికెట్‌ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/drunken-youths-blocked-an-rtc-bus-with-car-causing-an-argument/

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌ & వికెట్‌ కీపర్‌), అయిదెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మనిమారన్‌ సిద్దార్థ్‌, అవేశ్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News