IPL 2026 MI vs KKR: ఐపీఎల్ 2026 సీజన్- 19 రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ విన్నింగ్‌ను సొంతం చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/rangareddy-news/fire-accident-in-manikonda-alkapur-township/
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లై KKRపై MI జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ముంబై జట్టు గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న తమ తొలి మ్యాచ్ ఓటమి సెంటిమెంట్‌ను చెరిపివేసింది.
టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. నైట్ రైడర్స్ బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అజింక్యా రహానే 67 పరుగులు(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు), రఘువంశీ 51(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. MI బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-second-day-mi-vs-kkr-match/
221 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్.. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 78(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు), ర్యాన్ రికెల్టన్ 81(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులు) మొదటి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.

