HomeఆటIPL 2026: టాస్‌ గెలిచిన RR.. మొదట పంజాబ్ బ్యాటింగ్..

IPL 2026: టాస్‌ గెలిచిన RR.. మొదట పంజాబ్ బ్యాటింగ్..

IPL 2026: ఐపీఎల్‌ 2026 ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ రోజు 40వ మ్యాచ్‌ సందర్భంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు టాప్‌లో ఉన్నాయి. రెండు స్ట్రాంగ్‌ జట్లు తలపడటంతో నేటి మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో పోరుకు సిద్దమైన రెండు జట్లు ఆనవాతిగా టాస్‌లో పాల్గొన్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ పరాగ్‌ మొదటగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో సొంత మైదానంలో పంజాబ్స్‌ కింగ్స్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. కాగా ఈ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యార్‌ సారథ్యంలో పంజాబ్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తుంది.

- Advertisement -

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద్బుతమైన ఫామ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడియన ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి, ఒకటి టైగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. మరోవైపు.. రాజస్థాన్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో విజయం సాధించగా, మూడింట్లో పరాజయం పొందింది. ఇలా 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి తన ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.

Also Read: Deepika Padukone: రెండోసారి ప్రెగ్నెంట్.. బేబీ బంప్‌తో దీపికా, వీడియో వైరల్‌

పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ పోరుకు వేదికైంది. ఇక ప్రస్తుతం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. గత చరిత్రను పరిశీలిస్తే, ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 30 సార్లు తలపడగా రాజస్థాన్ 17 సార్లు, పంజాబ్ 12 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అజేయంగా ఉన్న పంజాబ్‌ను రాజస్థాన్ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికని సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News