HomeTop StoriesPBKS vs LSG: ప్రియాంశ్‌, కూపర్‌ విధ్వంసం.. లక్నోపై పంజాబ్‌ కింగ్స్‌ సూపర్‌ విక్టరీ

PBKS vs LSG: ప్రియాంశ్‌, కూపర్‌ విధ్వంసం.. లక్నోపై పంజాబ్‌ కింగ్స్‌ సూపర్‌ విక్టరీ

PBKS vs LSG IPL 2026: ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ విజయపరంపర కొనసాగుతోంది. అటు బ్యాటింగ్‌ ఇటు ఫీల్డింగ్‌లో అదరగొడుతూ ఓటమి అనేదే లేకుండా ప్రత్యర్థి జట్టుని చిత్తుగా ఓడిస్తోంది. నేడు మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-kkr-won-by-4-wickets-against-rr/

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ పంజాబ్‌ కింగ్స్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాప్‌ ఆర్డర్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్‌ స్కోరు 250 మార్కును దాటింది. ప్రియాంశ్‌ ఆర్య 93(37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు), కూపర్‌ కనోలీ 87(46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీకి చేరువలో పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్కస్‌ స్టోయినిస్‌ 29, శశాంక్‌ సింగ్‌ 17, నెహాల్‌ వదేరా 13 పరుగులు చేశారు. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ 5 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు, షమీ, మోహ్సిన్‌ ఖాన్‌ తలో వికట్‌ పడగొట్టారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hyderabad-cyber-crime-police-bust-massive-cyber-fraud-network-involved-banks/

255 భారీ పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన లక్నో జట్టు పోరాడి ఓడింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ వచ్చింది. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుని స్కోరును పెంచే క్రమంలో కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో లక్నో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 43(23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు), మార్‌క్రమ్‌ 42, మిచెల్‌ మార్ష్‌ 40, ఆయుష్‌ బదోనీ 35 పరుగులతో రాణించారు. ముకుల్‌ చౌదరి 21 రన్స్‌ చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో జాన్సెన్‌ 2, అర్షదీప్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌, యజువేంద్ర చాహల్‌ తలో వికెట్‌ తీశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News