HomeTop StoriesRR vs PBKS: పంజాబ్‌కి తొలి ఓటమి.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్ సూపర్‌ విక్టరీ

RR vs PBKS: పంజాబ్‌కి తొలి ఓటమి.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్ సూపర్‌ విక్టరీ

RR vs PBKS IPL 2026: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలి ఓటమిని చవిచూసింది. పంజాబ్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌  రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. యశస్వి జైస్వాల్‌, ఫెరారే అద్భుతమైన పర్ఫామెన్స్‌తో రాజస్థాన్‌ జట్టు ఘన విజయం సాధించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-pbks-vs-rr-won-the-toss-and-chose-bowling/

మహారాజా యాదవేంద్రా సింగ్ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకోగా పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌కి దిగింది. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 59(44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌), మార్కస్‌ స్టోయినిస్‌ 62(22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి రాజస్థాన్‌ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. కూపర్‌ కనోలీ(30), శ్రేయాస్‌ అయ్యర్‌(30), ప్రియాంశ్‌ ఆర్య(29)తో మంచి ఆటతీరు కనబరిచారు. దీంతో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో యశ్‌ పంజా 2, జోఫ్రా ఆర్చర్‌, నాందే బర్గర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-says-indias-future-city-to-compete-with-the-world/

223 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫెరేరా 52(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు నాటౌట్‌), యశస్వి జైస్వాల్‌ 51(27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌) పరుగులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వైభవ్‌ సూర్యవంశీ 43(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో చెలరేగి ఆడాడు. శుభమ్ దూబే(31), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌(29), ధ్రువ్‌ జురెల్‌(16) పరుగులతో రాణించారు. ఇక పంజాబ్‌ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్‌ సింగ్‌కి ఒక వికెట్‌ దక్కింది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News