HomeTop StoriesDC vs RCB: సొంతగడ్డపై ఢిల్లీ చిత్తు.. అదరగొట్టిన ఆర్సీబీ.!

DC vs RCB: సొంతగడ్డపై ఢిల్లీ చిత్తు.. అదరగొట్టిన ఆర్సీబీ.!

DC vs RCB IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు మ్యాచ్‌లో వార్‌ వన్‌ సైడ్‌గా మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చిత్తుగా ఓడించింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా డీసీపై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలిపోగా.. ఆ నామమాత్రపు స్కోరును ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించి ఈ సీజన్‌లో రికార్డు సృష్టించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/cm-revanth-launches-spandana-teams-in-hyderabad/

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 2.4 ఓవర్లకి కేవలం 7 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోవడం ఆ జట్టును భారీగా దెబ్బతీసింది. దీంతో డీసీ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జోష్ హేజిల్‌వుడ్(4/12), భువనేశ్వర్ కుమార్(3/5) స్వింగ్‌తో ఢిల్లీ బ్యాటర్లను ఉతికారేశారు. సలాం, కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మకి తలో వికెట్‌ దక్కింది. వీరి ధాటికి పవర్‌ప్లేలోనే ఢిల్లీ వెన్ను విరిగింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభిషేక్ పోరెల్(30) పోరాటంతో ఢిల్లీ కనీసం ఆ స్కోరు అయినా చేయగలిగింది. డేవిడ్ మిల్లర్(19) పరుగులు చేశాడు. కొందరు డకౌట్‌ కాగా మరికొందరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మొత్తంగా 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది.

dc vs rcb ipl 2026

Also Read: https://teluguprabha.net/telangana/rangareddy-news/heavy-crane-collapses-due-to-strong-winds-three-workers-killed/

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లే ముగిసిన కాసేపటికే మ్యాచ్‌ను ముగిచింది. ఒక్క జాకబ్ బెథెల్(20) వికెట్ మాత్రమే కోల్పోయింది. కైల్‌ జెమీసన్‌ ఈ వికెట్‌ పడగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (13 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 23 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. తాజా మ్యాచ్‌ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 6 విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. డీసీ మూడు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. కాగా, ఇరు జట్టు 8 మ్యాచుల చొప్పున ఆడాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News