HomeTop StoriesCSK vs RCB: ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ పర్ఫామెన్స్‌.. చెన్నైపై 43 పరుగుల తేడాతో ఘన విజయం

CSK vs RCB: ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ పర్ఫామెన్స్‌.. చెన్నైపై 43 పరుగుల తేడాతో ఘన విజయం

CSK vs RCB IPL 2026 Season 19: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్ మరోసారి విజృంభించింది. సిక్సర్ల మోతతో స్టేడియం దద్దరిల్లడమే కాకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ 19లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ విక్టరీతో ఈ సీజన్‌లో వరుసగా రెండో గెలుపును నమోదు చేసి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా సత్తా చాటింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-season-19-lsg-beat-srh-by-5-wickets/

టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకోగా ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. విరాట్‌ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌ మిస్‌ అయినప్పటికీ.. డెత్‌ ఓవర్లలో టిమ్‌ డేవిడ్‌(70 నాటౌట్‌- 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు), కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌(48 నాటౌట్‌- 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సులు) విజృంభించి జట్టుకి భారీ స్కోరును అందించారు. దీంతో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక, ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (46), విరాట్ కోహ్లీ (28), దేవదత్ పడిక్కల్ (50) కీలక ఇన్నింగ్స్‌ ఆడి మెరుగైన భాగస్వామ్యాన్ని అందించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-participated-all-india-police-football-championship-closing-ceremony/

ఇక, 251 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ఆరంభం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. అటు బ్యాట్‌తో విజృంభించిన ఆర్సీబీ టీం ఇటు బంతితోనూ తగ్గేదేలే అన్నట్లు పరుగుల కట్టడితో పాటు, వికెట్లనూ పడగొట్టడంలో సఫలమైంది. దీంతో 19.4 ఓవర్లలో 207 పరుగులకు సీఎస్‌కే ఆలౌట్‌ అయింది. దీంతో చెన్నై ఈ సీజన్‌లో వరుసగా మూడోసారి ఓటమిని చవిచూసింది. సంజూ శాంసన్‌(9), రుతురాజ్‌(7), ఆయుష్‌(1) కీలక వికెట్లు పడిపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. సర్ఫరాజ్‌(50), ప్రశాంత్‌ వీర్‌(43), ఓవర్టన్‌(37)తో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం దక్కలేదు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. డఫీ, కృనాల్‌, అభినందన్‌ తలో 2 వికెట్లు, సుయాశ్‌ ఒక వికెట్‌ తీశాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News