HomeఆటIPL 2026 SRH Vs RCB: ఘనంగా ఐపీఎల్ ప్రారంభోత్సవం.. టాస్ గెలిచిన ఆర్సీబీ

IPL 2026 SRH Vs RCB: ఘనంగా ఐపీఎల్ ప్రారంభోత్సవం.. టాస్ గెలిచిన ఆర్సీబీ

IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్ (IPL) 2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజస్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది.రంగురంగుల విద్యుత్ కాంతులు, బాణసంచా వెలుగుల మధ్య జరిగిన ప్రారంభోత్సవం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.ఇక అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది.

- Advertisement -

తొలి పోరు: ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో హోమ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడుతున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకమైన టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతోంది.

హోరెత్తుతున్న చిన్నస్వామి స్టేడియం..
బెంగళూరు హోమ్ గ్రౌండ్ కావడంతో స్టేడియం అంతా ‘ఆర్సీబీ.. ఆర్సీబీ..’ నినాదాలతో హోరెత్తిపోతోంది. గతేడాది చేజారిన టైటిల్‌ను ఈసారైనా ముద్దాడాలని బెంగళూరు కసితో ఉంటే, సరికొత్త వ్యూహాలతో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News