HomeTop StoriesRR vs SRH: అభిషేక్‌, ఇషాన్‌ బౌండరీల వర్షం.. రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌ రాయల్ విక్టరీ.!

RR vs SRH: అభిషేక్‌, ఇషాన్‌ బౌండరీల వర్షం.. రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌ రాయల్ విక్టరీ.!

RR vs SRH IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుగా ఓడించింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ బౌండరీల వర్షంతో ఆర్‌ఆర్‌పై మరోసారి గెలుపును సొంతం చేసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hyderabad-metro-to-come-under-government-control-from-may-1st/

టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకోగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌కి దిగింది. క్రీజులోకి వచ్చీ రాగానే ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ సిక్సర్లతో తన దూకుడు కొనసాగించాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10) నిరాశ పరిచినా ధ్రువ్‌ జురెల్‌ హాఫ్‌ సెంచరీ 51(35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) నమోదు చేసి జట్టు భారీ స్కోరు దిశగా కృషి చేశాడు. ఫెరేరా(33), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(11) పరుగులు చేశారు. దీంతో ఆర్‌ఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎషాన్‌ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్‌ హింగే, ప్యాట్‌ కమిన్స్‌, సాకిబ్‌ హుస్సేన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో వికెట్‌ తీశారు. 

Also Read: https://teluguprabha.net/sports-news/punjab-kings-beat-delhi-capitals-by-6-wickets-chase-264-score/

229 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. నిలకడగా ఆడుతూ గెలుపుని సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మ 57(29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌), కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ 74(31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక నితీశ్‌ కుమార్‌ రెడ్డి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 18 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. వీటిలో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. క్లాసెన్‌ 29 పరుగులు చేయగా.. ట్రావిస్‌ హెడ్‌ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. సలీల్‌ అరోరా(8) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో జట్టు ఇంకా బాల్స్‌ మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్‌ఆర్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేశ్‌ శర్మ తలో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఫెరేరా ఒక వికెట్‌ తీశాడు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News