Sunday, December 8, 2024
HomeఆటIPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. స్టార్ ఆటగాళ్ల కనీస ధర ఎంతంటే..?

IPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. స్టార్ ఆటగాళ్ల కనీస ధర ఎంతంటే..?

IPL Auction| ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈనెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు మెగా వేలం గ్రాండ్‌గా జరగనుంది. వేలంలో పాల్గొనేందుకు ఆటగాళ్లు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1570 మంది క్రికెట్ర్లు తమ పేర్లు నమోదుచేసుకున్నారు. ఇందులో 1165 మంది ఇండియన్స్, 409 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈసారి వేలంలోకి చాలా మంది స్టార్ ప్లేయర్లు అందుబాటులోకి రానున్నారు.

- Advertisement -

ముఖ్యంగా భారత స్టార్ ఆటగాళ్లకు రికార్డ్ ధర పలికే అవకాశం ఉంది. గతం సీజన్‌ వరకు ఢిల్లీ, కోల్‌కతా, లక్నో ఫ్రాంఛైజీలకు కెప్టెన్లుగా వ్యవహరించిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను ఆయా ఫ్రాంఛైజీలు వేలంలోకి వదిలేశాయి. దీంతో వీరికి భారీ ధర పలికే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ కనీస ధరను రూ.2కోట్లుగా నిర్ణయించుకున్నారు.

ఇక వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్‌, ఉమేశ్ యాదవ్‌, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్‌ ఖాన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్‌ కృష్ణ, నటరాజన్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, హర్షల్‌ పటేల్ కూడా రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా బేస్ ధర రూ.75 లక్షలుగా నిర్ణయించుకున్నారు. అలాగే విదేశీ ఆటగాళ్లు జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ కనీస ధరను రూ.2కోట్లుగా ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్ తొలిసారి ఐపీఎల్‌లో ఆడటం కోసం రూ.1.25 కోట్ల కనీస ధరతో వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. తన చివరి టీ20 మ్యాచ్ 2014లో ఆడటం విశేషం. 2004లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అండర్సన్‌.. 44 టీ20లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News