Saturday, November 15, 2025
HomeఆటIPL Auction: ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం

IPL Auction: ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం

IPL Auction| సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్(IPL) మెగా వేలం ప్రక్రియ ప్రారంభమైంది. భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) రికార్డు ధర పలికాడు. రూ.26.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ను దక్కించుకుంది. దీంతో గతేడాది మిచెల్ స్టార్క్‌ సాధించిన రికార్డు(రూ.24.75 కోట్లు) ధర బద్ధలైంది.

- Advertisement -

ఇక భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ను రూ.18కోట్లకు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

మెగా వేలానికి మొత్తంగా 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. అయితే వేలంలో 204 మందిప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇవాళ, రేపు ఈ వేలం కార్యక్రమం జరగనుంది. కాగా 2025లో మార్చి 14 నుంచి మే 25 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad