BCCI: ముంబయిలోని ప్రసిద్ధి చెందిన వాంఖడే స్టేడియంలో బీసీసీఐ కార్యాలయం నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు చోరీకి గురయ్యాయి. ఐపీఎల్ 2025 కోసం తయారు చేసిన ప్రత్యేక జెర్సీలను దొంగతనం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనంలో ప్రధాన నిందితుడిగా సెక్యూరిటీ గార్డు ఫరూఖ్ అస్లాం ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆడిట్ సమయంలో స్టోర్ రూమ్‌లో జెర్సీలు కనిపించకపోవడంతో విచారణ ప్రారంభమైంది. బీసీసీఐ అధికారులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, జూన్ 13న సెక్యూరిటీ గార్డు ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలిసింది. సెక్యూరిటీ గార్డు ఒక పెట్టెలో జెర్సీలను పెట్టుకొని వెళ్లిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది.
Readmore: https://teluguprabha.net/sports-news/gambhir-clash-with-oval-curator-video-goes-viral-online/
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సుమారుగా 261 జెర్సీలు చోరీకి గురయ్యాయి. ఒక్కో జెర్సీకి సుమారు ₹2,500 విలువ ఉండగా, మొత్తం నష్టం రూ.6.5 లక్షలుగా అంచనా వేయబడింది. విచారణలో షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయిన డబ్బు మళ్లీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడని తేలింది.
సోషల్ మీడియా ద్వారా హర్యాణకు చెందిన ఓ ఆన్ లైన్ డీలర్ కి, ఈ చోరీ చేసిన జెర్సీలను కొరియర్ ద్వారా పంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. జెర్సీలను కొనుగోలు చేసిన డీలర్‌ను విచారించగా.. ఈ జెర్సీలు దొంగిలించిన విషయం తనకు తెలియదని తెలిపాడు. స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా జెర్సీలు అమ్మకానికి ఉన్నాయని.. సెక్యూరిటీ గార్డు తనకు చెప్పాడుని ఆన్‌లైన్ డీలర్ పోలీసుల విచారణలో వాపోయాడు.
Readmore: https://teluguprabha.net/sports-news/ashwin-praises-gill-for-century-but-criticizes-captaincy/
జూలై 17న బీసీసీఐ అధికారులు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 జెర్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలినవి ఎక్కడ ఉన్నాయన్న విషయమై విచారణ కొనసాగుతోంది.


