HomeఆటIPL: వైభవ్‌పై కన్నెర్రజేసిన జేమీసన్.. ఐపీఎల్ రిఫరీ సీరియస్ యాక్షన్!

IPL: వైభవ్‌పై కన్నెర్రజేసిన జేమీసన్.. ఐపీఎల్ రిఫరీ సీరియస్ యాక్షన్!

Kyle Jamieson: ఐపీఎల్ 2026 రసవత్తరంగా సాగుతుంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. పలు జట్లు విజయాలతో దూసుకుపోతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి జైపూర్‌లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), దిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్ వివాదానికి కేంద్రబిందువైంది. దిల్లీ పేసర్ కైల్ జేమీసన్.. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగని ఉదంతం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే: దిల్లీ పేసర్ కైల్ జేమీసన్ వేసిన పదునైన యార్కర్‌కు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే వికెట్ పడగొట్టిన ఆనందంలో జేమీసన్ హద్దులు దాటి ప్రవర్తించాడు. అవుట్ అయి వెళ్తున్న వైభవ్ దగ్గరకు వెళ్లి.. అగ్రెసివ్‌గా చప్పట్లు కొడుతూ తీక్షణమైన చూపులతో రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మైదానంలో దూకుడు సహజమే అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభంలో ఉన్న 15 ఏళ్ల బాలుడి పట్ల అంతటి కఠినమైన ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విశ్లేషకులు మండిపడుతున్నారు.

Also read-RR vs DC IPL 2026: కేఎల్‌ రాహుల్‌, నిస్సాంక విధ్వంసం.. రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం

రిఫరీ సీరియస్ యాక్షన్!: ఈ ఘటనను ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేత్ తీవ్రంగా పరిగణించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవెల్ 1 నేరం కింద.. జేమీసన్‌కు ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు. జేమీసన్ తన తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే శిక్షను అమలు చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ చర్య ఇతర ఆటగాళ్లకు ఒక హెచ్చరిక అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News