Friday, November 8, 2024
HomeఆటIPL Retention: దీపావళి రోజే ఐపీఎల్ రిటెన్షన్ జాబితా.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

IPL Retention: దీపావళి రోజే ఐపీఎల్ రిటెన్షన్ జాబితా.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

IPL Retention| ఐపీఎల్ మెగా వేలంకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్‌కు గాను ఆటగాళ్ల వేలం నిర్వహించనుంది బీసీసీఐ(BCCI). అయితే వేలంకు సంబంధించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలకమండలి ఇప్పటికే ప్రకటించింది. అన్ని ఫ్రాంఛైజీలు మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు పాలకమండలి అనుమతిచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవాలి. అలాగే విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ ఎలాంటి పరిమితులు లేవు.

- Advertisement -

ఈ నేపథ్యంలో రిటైన్ చేసుకునే జాబితాను పాలకమండలికి అక్టోబర్ 31లోపు ఫ్రాంఛైజీలు సమర్పించాలి. గడువు సమీపిస్తుండటంతో రిటైజ్ జాబితాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరో ఇద్దరిని రిటైన్ చేసుకోవాలంటే రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఖర్చు చేయాలి. అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లకు రూ.4 కోట్లు చెల్లించాలి. ఈసారి టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెరిగింది.

ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల కార్యక్రమాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో కూడా లైవ్ చూడొచ్చు. రిటెన్షన్ జాబితాలకు సంబంధించి స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశాయి. అక్టోబర్ 31 సాయంత్రం 4.30 గంటల నుంచి రిటెన్షన్ జాబితాలను ప్రకటిస్తామని అందులో పేర్కొన్నాయి. జియో సినిమాలో ఈ లైవ్‌‌ను ఫ్రీగా వీక్షించవచ్చు. స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక నవంబర్ 30న మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News