భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్(IPL) రద్దు అయింది. ఈమేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా సమస్యల కారణంగా అర్ధంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం కారణంగా బీసీసీఐ పెద్దలు తాజాగా సమావేశమయ్యారు. దేశంలోని స్టేడియాలతో పాటు క్రికెట్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం దాడులు చేయవచ్చుననే అనుమానంతో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేశారు.