Irfan Pathan: ఆసియా కప్ లో పాక్ తో భారత్ పోరు జరగనుంది. ఇలాంటి వేళ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ప్రత్యర్థి బ్యాటర్‌ను బట్టి బుమ్రా బౌలింగ్‌లో మార్పులు చేస్తుంటాడని ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గత మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌ను చూస్తే చాలా నియంత్రణతో బంతులు విసిరాడు. ఏమాత్రం ఇబ్బంది పడలేదు. తన పేస్‌ను ఎలా వినియోగించుకోవాలో అతడికి బాగా తెలుసు. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ విధానం మారిపోతుంది. ఫఖర్ జమాన్ వంటి ఆటగాడు వేగంగా ఆడి మ్యాచ్‌లో మూమెంట్ తెప్పిద్దామని ప్రయత్నిస్తాడు. కానీ, బుమ్రా ముందు అతడి ఆటలు సాగవు. బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఫఖర్ పరుగులు చేయడం చాలా కష్టంగా మారుతుంది. తరానికి ఒక్కడు అనేలాంటి ప్లేయర్ బుమ్రా. ఒకవేళ బుమ్రా నుంచి ఫఖర్ తప్పించుకున్నా.. కుల్‌దీప్ యాదవ్‌ను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వీరి మధ్య పోరును చూడాలని ఆసక్తిగా ఉంది. కుల్‌దీప్ అద్భుతమైన రిథమ్‌లో ఉన్నాడు. ఆరునెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా లేడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.
Read Also: Bigg Boss Promo Today: కెప్టెన్ కే అన్ని అధికారాలు.. మతిమరుపుకి మందు వేసుకోమన్న నాగ్
బుమ్రా..!
ఇకపోతే, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. అతడ్ని ఆసియా కప్ తొలి మ్యాచ్ లో ఆడించొద్దని చాలా మంది చెప్పారు. పసికూన యూఏఈపై బరిలో దింపాల్సిన అవసరం లేదనేది అందరి వాదన. కానీ, మేనేజ్ మెంట్ మాత్రం పాక్ తో జరిగే ప్రెస్టీజియస్ మ్యాచ్ ముందు బుమ్రాకు ప్రాక్టీస్ కావాలని భావించింది. కాగా.. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా బ్రిలియంట్ గా బౌలింగ్ చేశారు. ఇప్పుడు కీలకమైన పాక్ తో పోరుకు సిద్ధమయ్యారు.
ప్రత్యేక పూజలు
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ మజానే వేరు. ఆసియా కప్‌లో ఇవాళ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ, ఈసారి బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ భారత్ గెలవాలంటూ క్రికెట్ అభిమానులు వినూత్నంగా అభిమానం చాటుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు, హోమాలు, జల హారతి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


