Sunday, January 18, 2026
HomeఆటTilak Varma: నేపాలీ క్రికెటర్ తో తిలక్ ప్రేమాయాణం.. ఇందులో నిజమెంత?

Tilak Varma: నేపాలీ క్రికెటర్ తో తిలక్ ప్రేమాయాణం.. ఇందులో నిజమెంత?

Tilak Varma New girlfriend: టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారాడు తిలక్. ఇతడికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

- Advertisement -

తిలక్ వర్మ, నేపాల్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఇందూ బర్మాతో డేటింగ్ లో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఆజ్యం పోసే విధంగా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. కొంత మంది వారిద్దరూ పర్ఫెక్ట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇదంతా పుకార్లు మాత్రమేనని.. ఆ ఫోటోలు ఏఐతో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

28 ఏళ్ల ఇందు బర్మ నేపాల్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహారిస్తోంది. 28 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ కుడి చేతితో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుంది. హిమాలయ దేశం తరపున బర్మ 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. 40 వికెట్లు తీయడంతోపాటు 1041 పరుగులు చేసింది. ఇందు బర్మ తన ఆటతోనే కాదు, అందంతోనూ ఫేమస్ అయింది.

Also Read: Abhishek Sharma -కింగ్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన అభిషేక్.. ఇంతకీ ఏంటి ఆ రికార్డు?

భారత జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్ తిలక్ వర్మ. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో దుమ్ము రేపుతున్నాడు. గత మ్యాచ్ లో 62 పరుగులు చేసి ఇండియాను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఆసియా కప్ ఫైనల్ లో మ్యాచ్ విన్ ఇన్నింగ్స్ ఆడి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు తిలక్. మన దేశం తరుపున ఈ కుర్రాడు 5 వన్డేలు, 38 టీ20 మ్యాచులు ఆడాడు.

Also Read: Ind vs SA – మూడో టీ20 మ్యాచ్ నేడే.. వారిద్దరూ ఈసారైనా రాణిస్తారా?

తిలక్ వర్మ చాలా దేశాలకు వెళ్లి టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడాడు. అయితే అతడు ఎప్పుడూ నేపాల్ లో క్రికెట్ ఆడలేదు. అలాంటిది ఇందు బర్మను తిలక్ కు ఎప్పుడు కలిశాడు? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News