HomeఆటIshan Kishan: ఇషాన్ కిషన్ 'ఇస్మార్ట్' కంబ్యాక్.. అభిషేక్ శర్మ రికార్డు బద్ధలు..

Ishan Kishan: ఇషాన్ కిషన్ ‘ఇస్మార్ట్’ కంబ్యాక్.. అభిషేక్ శర్మ రికార్డు బద్ధలు..

Ishan Kishan Breaks Abhishek Sharma record: చాలా కాలం తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, టీమ్ ఇండియాను పీకల్లోతు కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా అభిషేక్ శర్మ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు.

- Advertisement -

అభిషేక్ రికార్డు ఔట్!
ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ నెలకొల్పిన రికార్డును ఇషాన్ కిషన్ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ (21 బంతులు) కొత్త చరిత్ర సృష్టించాడు.

కష్టాల్లో ఉన్నప్పుడు ‘కిషన్’ అటాక్
209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో సంజూ శాంసన్, రెండో ఓవర్లో అభిషేక్ శర్మ ఔట్ కావడంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మొత్తం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లుతో 76 పరుగులు చేశాడు. ఇషాన్ ఔట్ అయ్యే సమయానికి భారత్ గెలుపు సమీకరణం 65 బంతుల్లో 81 పరుగులుగా మారిపోయింది, ఇది మిగిలిన బ్యాటర్లకు పనిని సులభతరం చేసింది.

Also Read: IND vs NZ -అభిషేక్ లేకున్నా అదరగొట్టారు.. ప్రపంచకప్‌కు ముందు ప్రత్యర్థులకు టీమిండియా స్ట్రాంగ్ వార్నింగ్!

రెండేళ్ల తర్వాత అదిరిపోయే రీఎంట్రీ..
నవంబర్ 2023 తర్వాత ఇషాన్ కిషన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపి, అద్భుతమైన ఫామ్‌ను కనబరచడం వల్లే ఇషాన్‌కు మళ్ళీ జట్టులో చోటు దక్కింది. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్, తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడు.

లీడ్ లో టీమ్ ఇండియా
ఇషాన్ కిషన్ వేసిన పునాదిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సౌధాన్ని నిర్మించాడు. కేవలం 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. చివర్లో శివమ్ దూబే (18 బంతుల్లో 36) మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Also Read: Ind Vs NZ- ఇషాన్‌, సూర్య ఊచకోత.. న్యూజిలాండ్‌పై భారత్‌ సంచలన విజయం.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News