Wedding Bells for Smriti Mandhana: ఆటతోనే కాదు అందంతోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన. అయితే ఈ అమ్మడు తర్వలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త నెట్టింట సంచలనంగా మారింది. ఈ విషయంపై ఆమె బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చాడు. ఇండోర్ లోని స్టేట్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మంధాన తన వివాహ వార్తను ధృవీకరించాడు. స్మతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతుందంటూ చెప్పకనే చెప్పేశాడు.
సినీ నిర్మాత, గాయకుడైన పలాష్ ముచ్చల్ 2019 నుండి డేటింగ్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్మృతి, పలాష్ చాలా సార్లు కలిసి బయట కనిపించారు. దీంతో వారు లవ్ లో ఉన్నారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.అయితే ఇరువురు తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పుడు బహిరంగంగా చెప్పలేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా స్మృతి మంధాన ఇండోర్ లో ఉంది. ఇదే సమయంలో పలాష్ ముచ్చల్ స్వయంగా తమ బంధంపై బహిరంగంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: IND vs AUS 01st ODI – రీఎంట్రీలో నిరాశపరిచిన రోకో..పెర్త్ వన్డేలో టీమిండియాకు పరాభవం..
ఇండోర్ కు చెందిన పలాస్.. డిష్కియాన్, భూతనాథ్ రిటర్న్స్ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. దీంతోపాటు రీసెంట్ గా మెగాఫోన్ చేతబట్టి రాజు బాజేవాలా అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ మూవీలో అవికా గోర్, చందన్ రాయ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇతడి నెట్ వర్త్ సుమారు రూ. 20 నుంచి 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ప్రపంచకప్ విషయానికొస్తే.. తన తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత మహిళల జట్టు తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి తన స్థానాన్ని మరింత క్లిష్టతరం చేసుకుంది


