గత కొన్ని సంవత్సరాలుగా రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ఉన్న కోతుల వల్ల గ్రామస్తులు దిన దినం భయాందోళనలకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామంలో ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే గెలిచినాక మీ గ్రామంలో కోతుల ఇబ్బందిని తొలగిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి కోతులను పట్టించారు.
ఎమ్మెల్యే జనంపల్లి జనంపల్లి అనిరుధ్ రెడ్డి కల్లేపల్లి గ్రామానికి వెళ్లి కోతులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పట్టుకున్న కోతులకు ఆహారం అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామానికి మాటిచ్చినట్లుగా అంగన్వాడి భవనానికి 18 లక్షలు సాంక్షన్ చేపించానని, అలాగే గ్రామంలో కోతుల ఇబ్బంది ఉన్నందున కోతులను లేకుండా చేస్తానని చెప్పినట్లుగా కోతులను పట్టించానని అన్నారు.
డబల్ రోడ్డు మాట ఇచ్చినట్లుగా రంగారెడ్డి గూడ గ్రామం నుండి మీ గ్రామం మీదుగా ఈద్గాన్ పల్లి, రాజాపూర్ వరకు నెక్లెస్ రోడ్ శాంక్షన్ చేపించానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున శాంక్షన్ చేశారు. వాటిని పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక ప్రతి గ్రామంలో ఉన్న నిరుపేదలకి అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.