Thursday, April 17, 2025
HomeఆటJadcharla: కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించనిది అంటూ లేదు

Jadcharla: కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించనిది అంటూ లేదు

క్రీడాకారులు కృషి పట్టదలతో ప్రయత్నిస్తే సాధించనిది అంటూ ఏమి లేదని జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి అన్నారు. జడ్చర్ల ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షుడు కాల్వ రాంరెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల మినీ స్టేడియంలో వాకర్స్, క్రీడాకారుల ప్రయోజనాల దృష్ట స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ అమర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి హాజరై లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాంరెడ్డి తన సొంత ఖర్చులతో జడ్చర్ల క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్లను ఏర్పరచడం అభినందనీయమని, క్రీడాకారుడు తాను ఎంచుకున్న రంగంలో లక్ష్యాన్ని సాధించే విధంగా కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు.

- Advertisement -

కార్యక్రమంలో ఫ్లైఓవర్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి, కౌన్సిలర్లు సతీష్ కుమార్, రఘురాం గౌడ్, సుంకసారి రమేష్, దేవదానం, పరమటయ్య, మోయిన్, కిట్టు, శ్రీను, కడమంచి చెన్నయ్య, క్రీడాకారులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News