India Vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ గాయంతో ఐదో టెస్టుకు దూరమయ్యారు. పంత్ స్థానంలో తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేశారు. ఈ వార్తను బీసీసీఐ ధృవీకరించింది. చివరి టెస్ట్ లో గెలిచి 2-2తో సమం చేయాలని చూస్తున్న టీం ఇండియా.. ఈ మ్యాచ్ లో జగదీశన్ కి ఆడే అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇది జగదీశన్‌కు టెస్టు జట్టులో తొలి ఎంపిక. ప్రస్తుతం 29 ఏళ్ల జగదీశన్ దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు.
2016లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన జగదీశన్ ఇప్పటివరకు 79 ఇన్నింగ్స్‌లలో 47.50 సగటుతో 3,373 పరుగులు చేశాడు. వీటిలో 10 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలో రెండు వరుస సీజన్లలో తమిళనాడు తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Readmore: https://teluguprabha.net/sports-news/divya-deshmukh-wins-2025-fide-womens-world-cup/
2023–24 లో 13 ఇన్నింగ్స్ లలో 816 (సగటు 74.18) పరుగులు, 2024–25 లో 13 ఇన్నింగ్స్ లలో 674 (సగటు 56.16) పరుగులు చేసాడు. చండీగఢ్‌పై 321 పరుగులు చేసి డబ్ల్యూవీ రామన్ (313) రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ లో 403 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు శతకాలు చేసి, 830 పరుగులతో టాప్ స్కోరర్ అయ్యాడు. ఇదే టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 141 బంతుల్లో 277 పరుగులు చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
జగదీశన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 13 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 7 మ్యాచులలో 73 పరుగులు చేసాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 6 మ్యాచులలో 89 పరుగులు చేసాడు.
ఐదో టెస్టులో భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).


