Sunday, October 6, 2024
HomeఆటJammikunta: క్రీడా పోటీలలో గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలి

Jammikunta: క్రీడా పోటీలలో గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలి

ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్

క్రీడ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించాలని ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా ఏబీసీ కింగ్స్ నిర్వాహకులు రాజు, సల్మాన్, ముత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ క్రీడా పోటీలు ముగిశాయి. క్రికెట్ క్రీడా పోటీలలో మొత్తం 24 జట్లు పాల్గొనగా రన్నర్ గా గ్రౌండ్ లెవెన్ టీం, విన్నర్ గా ఖుషి లెవెన్ టీం విజయం సాధించగా రన్నర్ టీంకు రూ,5000 నగదుతో పాటు ఫీల్డ్ ను, విన్నర్ టీంకు రూ,పదివేల నగదుతో పాటు ఫీల్డ్ ను ఎంపీపీ పావని వెంకటేష్ అందజేశారు. క్రికెట్ క్రీడా పోటీలలో పలు విభాగాలలో నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు సీల్డ్ ను అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీపీ పావని వెంకటేష్ మాట్లాడుతూ… క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయని అన్నారు. యువత తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించడంతో ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం యువత ఎక్కువ శాతం సెల్ ఫోన్ వీడి ఉండడం లేదని దీంతో మానసిక వేదనకు గురై అవకాశం ఉంటుందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే శారీరక శ్రమతో పాటు మానసిక ఆనందం లభిస్తుందన్నారు. పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులను పేరుపేరునా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News