Jasprit Bumrah Creates History: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. అక్టోబర్ 2న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. గత 113 సంవత్సరాలుగా ఎవరూ అందుకొని ఫీట్ ను ఇతడు సాధించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యంత వేగంగా(24 ఇనింగ్స్) 50 వికెట్లు సాధించిన టీమిండియా బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. విదేశీ పిచ్‌లపై ఇప్పటికే ఈ ఘనతే సాధించాడు బుమ్రా.
గురవారం ప్రారంభమైన టెస్టులో విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ మరియు జోహన్ లేన్ వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు బుమ్రా. ఈ స్టార్ బౌలర్ 1747 బంతుల్లో 50 వికెట్లు తీశాడు. భారత లెజండరీ బౌలర్ శ్రీనాథ్ 24 ఇన్నింగ్స్‌లలో శ్రీనాథ్ 50 వికెట్లు తీయగా.. దానిని ఇప్పుడు బుమ్రా సమం చేశాడు. కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్‌లలో, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ 27 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ ను సాధించారు.
Also read: Abhishek Sharma – ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డ్.. కోహ్లీకి కూడా సాధ్యం కానీ..
బుమ్రా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు స్వదేశంలో 50 వికెట్లు తీసిన రెండవ బౌలర్ మరియు మొదటి పేసర్ గా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా ఇంగ్లాండ్‌లో 12 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు, ఆస్ట్రేలియా గడ్డపై 12 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు తీశాడు. ఈ ప్రత్యేక ఘనత సాధించిన ఏకైక ఆటగాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్. మొత్తం మీద మూడు వేర్వేరు దేశాలలో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 11వ బౌలర్ బుమ్రా. ఈ ఘనత సాధించిన ఏడవ పేసర్ కూడా. ఇంతక ముందు ఏ ఇండియన్ బౌలర్ గా కూడా ఈ ఫీట్ సాధించలేదు.


