HomeఆటIND vs USA: అమెరికాతో మ్యాచ్‌కు బుమ్రా దూరం.. లక్కీ ఛాన్స్ కొట్టిన సిరాజ్!

IND vs USA: అమెరికాతో మ్యాచ్‌కు బుమ్రా దూరం.. లక్కీ ఛాన్స్ కొట్టిన సిరాజ్!

IND vs USA Playing XI Telugu: టీ20 ప్రపంచకప్ 2026 వేటను ప్రారంభించబోతున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ (జ్వరం) కారణంగా నేడు అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ వార్త ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

బుమ్రాకు విశ్రాంతి.. సిరాజ్ ఎంట్రీ!
గత కొంతకాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న బుమ్రా, మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైనప్పటికీ బౌలింగ్ చేయలేదు. దీంతో మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్, ఇప్పుడు బుమ్రా గైర్హాజరీలో తుది జట్టులో ఆడే అవకాశం దక్కింది.

తగ్గిన బలం: వాషింగ్టన్ సుందర్ ఇంకా బెంగళూరులోని ఎన్‌సీఏలోనే ఉండటం, హర్షిత్ రాణా దూరం కావడం, ఇప్పుడు బుమ్రాకు జ్వరం రావడంతో భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 13 మంది ఫిట్ ప్లేయర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ఓపెనర్‌గా ఇషాన్.. సంజూ ఔట్!
బ్యాటింగ్ లైనప్‌లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్‌గా అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయమైంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇషాన్ 53 పరుగులు చేయగా, అంతకుముందు న్యూజిలాండ్‌పై కూడా 103 పరుగులతో రాణించడంతో అతడి ఫ్లేస్ ఫిక్స్ అయింది. వరుసగా విఫలమవుతున్న సంజూ శాంసన్‌ను కాదని, జట్టు మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌కే ఓటు వేసింది. దీంతో సంజూ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

Also Read: T20 World Cup 2026 -టీ20 వరల్డ్ కప్ వేడుకల్లో బాద్‌షా పాటలు.. నోరా ఫతేహీ స్టెప్పులు!

తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News