Thursday, January 9, 2025
HomeఆటICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో చరిత్ర సృష్టించిన బుమ్రా.. నువ్వు సూపరేహే..!

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో చరిత్ర సృష్టించిన బుమ్రా.. నువ్వు సూపరేహే..!

టెస్ట్ ర్యాంకింగ్స్ ను ఐసీసీ విడుదల చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సాధించిన ఆస్ట్రేలియా టీమ్.. ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక సిరీస్‌కుముందు రెండో స్థానంలో ఉన్న భార‌త్‌.. 1-3 తేడాలో ఘోర పరాభవాన్ని చవి చూడటంతో.. మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు సౌతాఫ్రికా టీమ్‌ రెండో స్థానానికి ఎగ‌బాకింది.

- Advertisement -

ఇండివిజువ‌ల్ ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో బెస్ట్ బౌల‌ర్‌గా ఉన్న.. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆసిస్‌తో చివ‌రి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోయినా.. ఒక పాయింట్ పెంచుకొని 908 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉన్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఇండియన్ బౌలర్ కూడా బుమ్రానే కావడం మరో విశేషం.

ఇక 2016లో ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు. ఇప్పుడు బుమ్రా దానిని అధిగమించి సరికొత్త రికార్డును నెల‌కొల్పాడు. ఇక బుమ్రా త‌ర్వాత ఆస్ట్రేలియా స్కిప‌ర్ పాట్ క‌మిన్స్ రెండో స్థానంలో ఉండ‌గా.. సౌతాఫ్రికా పేస‌ర్ కాగిసో ర‌బాడా మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇక భారత వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో 61 ప‌రుగులు చేయ‌డంతో మూడు స్థానాలు మెరుగై .. 12 నుంచి 9కి దూసుకొచ్చాడు. ఇక టాప్ టెన్ బ్యాట‌ర్ల స్థానాల్లో యశస్వీ జైస్వాల్ నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్ తొలి రెండుస్థానాల్లో ఉన్నారు. న్యూజీల్యాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్‌స‌న్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఇక టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మూడు స్థానాలు దిగజారాడు. 27 వ స్థానానికి ప‌డిపోయాడు. అటు రోహిత్ శ‌ర్మ రెండు స్థానాలు దిగ‌జారి 42వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

బోర్డర్ గవాస్కర్ సిరీస్ చివరి టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలండ్.. ఏకంగా 29 స్థానాలు ఎగ‌బాకి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రవీంద్ర జడేజాతో కలిసి 745 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. సిరీస్‌లో బోలండ్ మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News