Saturday, November 23, 2024
HomeఆటJinnaram: ముగిసిన జిఎంఆర్ క్రికెట్ కప్

Jinnaram: ముగిసిన జిఎంఆర్ క్రికెట్ కప్

జిన్నారం నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, గ్రామీణ క్రీడాకారుల ఉన్నతికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన జిన్నారంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, సొంత నిధులతో నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితంలో విద్య ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని అన్నారు. సరైన సహకారం, శిక్షణ అందిస్తే గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తారని అన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఐదు ఎకరాల విస్తీర్ణంతో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులందరూ పోటీల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రథమ విజేతకు 55,555, ద్వితీయ విజేతకు 33,333 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, జిన్నారం గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మండల పరిధిలోకి వివిధ గ్రామాల, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News