Monday, November 25, 2024
HomeఆటViral video : ఇలా కూడా బంతిని షైన్ చేయ‌వ‌చ్చా..? నీది మామూలు వాడ‌కం కాదు...

Viral video : ఇలా కూడా బంతిని షైన్ చేయ‌వ‌చ్చా..? నీది మామూలు వాడ‌కం కాదు సామీ

Viral video : క్రికెట్‌లో బంతిని షైన్ చేసేందుకు బౌల‌ర్లు సలైవా(ఉమ్ము) ను వాడుతుంటారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దీన్ని పూర్తిగా ర‌ద్దు చేశారు. దీంతో బంతిని మెరుగుదిద్దేందుకు బౌల‌ర్లు, ఫీల్డ‌ర్లు ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నారు. కొంద‌రు త‌మ చెమ‌ట‌తో బంతిని షేన్ చేసుకున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇలా కూడా బంతిని షైన్ చేయ‌వ‌చ్చా అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటీజ‌న్లు.

- Advertisement -

17 ఏళ్ల సుధీర్ఘ విరామం త‌రువాత పాకిస్థాన్ గ‌డ్డ‌పై ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ను ఆడుతోంది. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. బ్యాట‌ర్లు పోటీ ప‌డి శ‌త‌కాల మీద శ‌త‌కాలు బాదుతుంటే నిర్జీవ‌మైన పిచ్‌పైన బౌల‌ర్లు వికెట్లు తీయ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

మూడ‌వ రోజు ఆట‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన ప‌ని హైలెట్‌గా నిలిచింది. పాక్ ఇన్నింగ్స్ 72 ఓవ‌ర్‌లో త‌మ స్పిన్న‌ర్ జాక్ లీచ్‌ను రూట్ పిలిచాడు. రూట్ వ‌ద్ద‌కు జాక్ రాగానే బ‌ట్ట‌త‌ల‌పై బంతిని రుద్ది నువ్వులు పూయించాడు. బాల్‌కు అతని బట్టతలపై ఉన్న చెమట అంటింది. మళ్లీ దాన్ని హ్యాండ్‌ టవల్‌తో గట్టిగా రుద్దుతూ బంతిని షైన్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

బంతిని షైన్‌ చేయడానికి రూట్‌ కొత్త పద్దతి కనిపెట్టాడంటూ పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News