Thursday, December 5, 2024
HomeఆటJoe Root: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

Joe Root: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

Joe Root| ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డునే అధిగమించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో (1625) పరుగులు సాధించగా.. ఇప్పుడు రూట్ మాత్రం కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ 23 పరుగులు చేసి ఈ ఘనత అందుకున్నాడు.

- Advertisement -

ఇక రూట్, సచిన్ తర్వాత అలిస్టర్ కుక్ – 1611 (53 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్ స్మిత్ – 1611 (41 ఇన్నింగ్స్‌లు), శివనారాయణ్ చందర్‌పాల్ – 1580 (49 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన రూట్.. 12,777 పరుగులు చేసి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News