Jos Buttler Breaks James Anderson Record: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌తో (ఫిబ్రవరి 1) బట్లర్ ఇంగ్లాండ్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆయన ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
జేమ్స్ ఆండర్సన్ రికార్డు కనుమరుగు
ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు జేమ్స్ ఆండర్సన్ (401 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బట్లర్ తన కెరీర్‌లో 402వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, ఆండర్సన్‌ను రెండో స్థానానికి నెట్టేశారు.
బట్లర్ తన సుదీర్ఘ కెరీర్‌లో:
టెస్టులు: 57 (2907 పరుగులు)
వన్డేలు: 199 (5515 పరుగులు, 11 సెంచరీలు)
టీ20లు: 146 (3925 పరుగులు)
టాప్-4 ఆటగాళ్లు:
జోస్ బట్లర్- 402
జేమ్స్ ఆండర్సన్- 401
జో రూట్- 384
ఇయాన్ మోర్గాన్- 346
Also Read: U19 WC 2026 -సెమీస్ లో ఆఫ్ఘాన్‌తో భారత్ ఢీ.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
సచిన్ రికార్డుపై కన్నేసిన జో రూట్
ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న జో రూట్ (384 మ్యాచ్‌లు) టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) రికార్డును బద్దలు కొట్టే దిశగా రూట్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 13,943 టెస్ట్ పరుగులు ఉన్నాయి.
బట్లర్ లక్ష్యం ‘450’
జోస్ బట్లర్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే ఇంగ్లాండ్ తరపున 450 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా బట్లర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

