Friday, November 22, 2024
HomeఆటJune 23rd Olympic run: జూన్ 23న ఒలంపిక్ డే రన్ -2023

June 23rd Olympic run: జూన్ 23న ఒలంపిక్ డే రన్ -2023

క్రీడా స్ఫూర్తిని చాటేలా ఒలంపిక్ డే రన్

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఒలంపిక్ డే రన్ ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. CM KCR ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు మంత్రి. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలు క్రీడాకారులకు ఎంతో ప్రేరణగా నిలిచాయని, హైదరాబాదులో నిర్వహిస్తున్న ఒలంపిక్ డే రన్ లో 15 సెంటర్ల నుండి 10వేలకు పైగా క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఒలంపిక్ డే రన్ ను విజయవంతం చేయడానికి ప్రభుత్వ శాఖలు పోలీస్, జిహెచ్ఎంసి, విద్య, వైద్య ,ఆర్టీసీ, ట్రాఫిక్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో ఒలంపిక్ డే రన్ కోసం నియమించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

- Advertisement -

క్రీడా స్ఫూర్తిని చాటేలా ఒలంపిక్ డే రన్ ముగింపు వేడుకలు ఉండాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ SATS ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతి లోని తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ , తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ & హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సహకారంతో ఈనెల 23న హైదరాబాదులోని 15 ప్రముఖ సెంటర్ల నుండి ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియం వరకు ఒలంపిక్ రన్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఒలంపిక్ డే రన్ సందర్భంగా రూపొందించిన క్రీడాకారులు ధరించే జెర్సీలను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా క్రీడా పాలసీని రూపొందించామన్నారు. తెలంగాణ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి కామన్వెల్త్ లాంటి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల విద్యార్థులకు అవగాహన, క్రీడా సంస్కృతినీ పెంపొందించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 18 వేల క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వల్ల నేడు రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరిచి పతకాలను సాధిస్తున్నారన్నారు.

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ ను నిర్వహించడానికి ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 22 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒలంపిక్ రన్ను ఘనంగా నిర్వహించామన్నారు. అలాగే ముగింపు వేడుకలను హైదరాబాద్ నగరంలో ప్రముఖ 15 కేంద్రాలైనా చార్మినార్, విక్టరీ ప్లేగ్రౌండ్, హనుమాన్ వ్యాయామశాల, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్ గూడా, బోయినపల్లి, హెల్త్ లీగ్ ,ఫతే మైదాన్ క్లబ్ ,సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం, ఖైరతాబాద్ లోని విశ్వేశ్వర విగ్రహం, నారాయణ వైఎంసిఏ, ఉస్మానియా యూనివర్సిటీ, హిమాయత్ నగర్ లోని వాసవి పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ల నుండి సుమారు 10 వేల మంది క్రీడాకారులు, విద్యార్థులు ఈ ఒలంపిక్ డే రన్ లో పాల్గొని మగింపు కార్యక్రమం ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఒలంపిక్ డే రన్ విజయవంతంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల చైర్మన్ లు డా. ఆంజనేయ గౌడ్, ఒలంపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్ కో కన్వీనర్ లు మహేశ్వర్, మల్లారెడ్డి ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News