Junior Hockey Nationals 2025: హాకీ ఇండియా జూనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన పోటీలలో డివిజన్ Aలో కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తమ ప్రత్యర్థులపై గెలిచాయి. డివిజన్ Bలో చండీగఢ్, జమ్మూ&కాశ్మీర్, ఢిల్లీ గెలిచాయి.
కర్ణాటక జట్టు ఆంధ్రప్రదేశ్‌పై 10-1 తేడాతో విజయం సాధించింది. ఇందులో కర్ణాటక నుండి హర్పాల్, తనిష్ రమేష్ హులకుండ్ -2 గోల్స్ చేసారు. కెప్టెన్ ధృవ బీఎస్, అచయ్య ఎం.ఎం, కుశాల్ బోపయ్య సీబీ, రాజు మనోజ్ గాయక్వాడ్, నితేశ్ శర్మ, పూజిత్ కె.ఆర్ -1 గోల్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి పటాన్ అసాద్ ముస్ఫిన్ ఖాన్ -1 గోల్ మాత్రమే చేసాడు.
హర్యానా జట్టు స్థిరమైన ఆటతీరు కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్టు దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూపై ఏ గోల్ అవకాశం ఇవ్వకుండా గెలిచింది. నితిన్, చిరాగ్, సునీల్ ముగ్గురు కలిసి మూడు గోల్స్ చేసి విజయం సాధించారు.
Read more: https://teluguprabha.net/sports-news/lionel-messi-india-tour-2025-kolkata-delhi/
ఉత్తరప్రదేశ్ జట్టు దూకుడుగా ఆడి మహారాష్ట్రపై గోల్స్ వర్షం కురిపించింది. ఉత్తరప్రదేశ్ హాకీ జట్టు మహారాష్ట్రపై 9-2 తేడాతో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ నుండి ఉజ్వల్ పాల్, మిథిలేష్ యాదవ్ – 2 గోల్స్ చేసారు. వెన్వన్షీ త్రిలోకీ, ఫహద్ ఖాన్, సత్యం పాండే, ఆకాశ్ పాల్, మనోజ్ యాదవ్ – 1 గోల్ చేశారు. మహారాష్ట్ర నుండి కెప్టెన్ అర్జున్ సంతోష్ హర్గుడే, కార్తిక్ రమేష్ పాటారే – 1 గోల్ చేశారు.
పంజాబ్, తమిళనాడును 8-4 తేడాతో చిత్తు చేసింది. పంజాబ్ నుండి అమన్‌దీప్, లవనూర్ సింగ్, జోబన్‌ప్రీత్ సింగ్ – 2 గోల్స్ చేసారు. చరణ్‌జీత్ సింగ్, కెప్టెన్ గుర్సేవక్ సింగ్ -1 గోల్ చేశారు. తమిళనాడు నుండి ఆకాష్ కె -1 గోల్ చేయగా మనిమరణ్ వి హ్యాట్రిక్ చేసి ఆకట్టుకున్నాడు.
చండీగఢ్ జట్టు హిమాచల్ ప్రదేశ్ పై 5-3 తేడాతో విజయం సాధించింది. చండీగఢ్ నుండి గుర్జీత్ సింగ్ – 4 గోల్స్, శరణ్‌దీప్ సింగ్ – 1 గోల్ చేసారు. హిమాచల్ నుండి అనుబంధ్ రంగ్రా, అనుజ్, తనిష్ కుమార్ ముగ్గురు ఒక్కో గోల్ చేసారు.
Read more: https://teluguprabha.net/sports-news/droupadi-murmu-on-india-s-women-chess-champions/
జమ్మూకాశ్మీర్ జట్టు అరుణాచల్ ప్రదేశ్ పై 5-4 తేడాతో విజయం సాధించింది. జమ్మూకాశ్మీర్ నుండి కెప్టెన్ రాజ్వీర్ సింగ్ ఒక్కడే 5 గోల్స్ చేసాడు. అరుణాచల్ నుండి సతీష్ కుమార్ ఠాకూర్, వివేక్ యాదవ్, అభి రాజ్భర్, కెప్టెన్ అమర్జీత్ సింగ్ నలుగురు ఆటగాళ్లు కలిసి నాలుగు గోల్స్ సాధించారు.
ఢిల్లీ జట్టు 3-0 తో ఉత్తరాఖండ్ జట్టుకి ఎటువంటి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచింది. ఇందులో భాను – 2 గోల్స్, యువరాజ్ సింగ్ – 1 గోల్ చేసారు.


