భారత జట్టుకు ఎంపికైన కడప అమ్మాయిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఎన్. శ్రీ చరణి భారత మహిళల క్రికెట్ జట్టు(Indian women’s cricket team)కు ఎంపికయ్యారు.
- Advertisement -
శ్రీలంక, దక్షిణాఫ్రీకాతో వన్డే ట్రై సిరీస్ ఆడే టీమ్ ఆమె చోటు దక్కించుకున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ చరణి రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారని, ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ X వేదికగా అభినందనలు తెలిపారు. క్రికెట్లో ఆమె జర్నీ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.