Saturday, November 15, 2025
HomeఆటKane Williamson: అయ్యో.. ఎంతపని చేస్తివి కేన్ మామ..!

Kane Williamson: అయ్యో.. ఎంతపని చేస్తివి కేన్ మామ..!

Kane Williamson: న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో అభిమానులు షాక్ అయ్యారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అయితే, ఇలాంటి సమయంలో టీ20లకు రిటైర్ కావాలని తన నిర్ణయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. తాను పదవి నుంచి వైదొలగడానికి, ఇతరులను బాధ్యతలు చేపట్టేందుకు సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు కేన్స్ విలియమ్సన్ చెప్పాడు.

- Advertisement -

Read Also: Rohan Bopanna: వీడ్కోలు మాత్రమే.. ముగింపు కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ లెజెండ్

ఇదే సరైన సమయం

“ఇంతకాలం ఇలా  టీ20ల్లో నేను భాగం కావడాన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఈ ప్రయాణంలోని జ్ఞాపకాలు, అనుభవాలకు నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు, నా జట్టుకు ఇది సరైన సమయం. ఇది వచ్చే టీ20 వరల్డ్ కప్ పోటీలో తలపడేందుకు జట్టుకు స్పష్టతనిస్తుంది” అని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కేన్స్ విలియమ్సన్ తెలిపాడు. “టీ20ల్లో చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్స్ ఉన్నారు. తర్వాత వచ్చే టీ20 మ్యాచెస్ కొత్త కుర్రవాళ్లకు మంచి అవకాశం. వారిని వరల్డ్ కప్‌కు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. మిచ్ (మిచెల్ సాంట్నర్) ఒక బ్రిలియంట్ కెప్టెన్, నాయకుడు. ఈ ఫార్మాట్‌లో బ్లాక్ క్యాప్స్‌ను ముందుకు నడపడానికి వారి సమయం ఆసన్నమైంది. నేను వారికి సపోర్ట్‌గా నిలుస్తాను” అని చెప్పాడు.

Read Also: Women’s World Cup: కప్పు కొడతామా? స్పిన్ అస్త్రం వాడాల్సిందేనా..!

75 సార్లు కెప్టెన్సీ..

ఇకపోతే 2011లో టీ20ల్లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల కెప్టెన్ కేన్స్ 75 సార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో బ్లాక్ క్యాప్స్ టీమ్ 2016, 2022లో టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే, 2021 ఎడిషన్‌లో ఫైనల్‌‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడింది. కానీ ఓడిపోయింది. అంతర్జాతీయంగా 93 టీ20లు ఆడిన కేన్‌ 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 95.  ఇక, కేన్‌ విలియమ్సన్‌ 2011లో జింబాబ్వేపై టీ20ల్లోకి అరంగేట్రం చేయగా.. చివరి మ్యాచ్‌ను 2024లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. అప్పట్నుంచి టీ20ల్లో మాత్రం ఆడట్లేదు.  ఇక, రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన కేన్స్ డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టెస్టుల వైట్ బాల్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad