HomeఆటKapil Dev: క్రికెట్ లెజెండ్ కొత్త ఇన్నింగ్స్.. గ్రేటర్ నోయిడాలో 300 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిపై...

Kapil Dev: క్రికెట్ లెజెండ్ కొత్త ఇన్నింగ్స్.. గ్రేటర్ నోయిడాలో 300 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రశంసలు

Kapil Dev- 300 beds Super Speciality Hospital: భారత క్రికెట్‌ను 1983 ప్రపంచకప్‌ విజయంతో కొత్త మలుపు తిప్పిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో సమాజ సేవే లక్ష్యంగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా (సెక్టార్ 10)లో 300 పడకల సామర్థ్యంతో నిర్మించిన ‘కేడీఎస్‌జీ (KDSG) సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి’ అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

వ్యాపారవేత్త సునీల్ కుమార్ గుప్తాతో కలిసి కపిల్ దేవ్ ఈ అత్యాధునిక వైద్య కేంద్రాన్ని సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. ఈ ఆసుపత్రిని మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి 16కు పైగా ప్రత్యేక విభాగాల్లో నాణ్యమైన, అత్యంత విశ్వసనీయమైన వైద్యాన్ని సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో అందించడమే ఈ ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని కపిల్ దేవ్ వెల్లడించారు. ఈ ఆసుపత్రి వల్ల స్థానికంగా సుమారు 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తున్నాయి. 

క్రికెట్‌ మైదానంలో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచిన కపిల్ దేవ్, ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ రకమైన సామాజిక దృక్పథంతో ముందడుగు వేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News