చెన్నైలో శుక్రవారం నుంచి జరిగే సౌత్ ఇండియా యూనివర్సిటీ చదరంగం పోటీలకు కరీంనగర్ లోని జీనియస్ చెస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు ఎంపికైనట్టు చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి కనకయ్య, కోచ్ కంకటి అనూప్ కుమారులు తెలిపారు.
- Advertisement -
ఇటీవల జరిగిన శాతవాహన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో రాణించిన శ్రీనిజ, స్వాతి, నితిన్, అరుణ్, జేఎన్టీయూ నుండి వరుణ్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం అకాడమీలో క్రీడాకారులను వారు అభినందించారు. సౌత్ ఇండియా పోటీల్లో రాణించి పతకాలు సాధించాలని సూచించారు. క్రీడాకారుల ఎంపిక పట్ల కోచ్ లు సృజన్, అనూష్, అభిరామ్, రేవిక్ , తల్లిదండ్రులు, అభినందించారు.