Kerala Cricket League 2025: త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ వేలం కోసం దేశీవాళీ ఆటగాళ్లు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళ క్రికెట్ లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఆదివారం కొచ్చి బ్లూ టైగర్స్ వర్సెస్ కొల్లం సెల్లార్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు పరుగులు సునామీ సృష్టించారు. ముఖ్యంగా కొల్లం బ్యాటర్ విష్ణు వినోద్ వరుస ఓవర్లలో హ్యాటిక్య్ సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ లీగ్‌లో భాగంగా.. ఆగస్టు 24 ఆదివారం నాడు తిరువనంతపురంలో జరిగిన కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు ఏరియస్ కొల్లం సెయిలర్స్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయిలర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ నాయర్ త్వరగానే ఔటవ్వగా.. మరో ఓపెనర్ విష్ణు వినోద్ మాత్రం సత్తా చాటాడు. కెప్టెన్ సచిన్ బేబీతో కలిసి విష్ణు టీమ్ కు మంచి స్కోర్ అందించాడు. వినోద్ కేవలం 41 బంతుల్లో 94 పరుగులు చేయగా.. బేబీ 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
విష్ణు వినోద్ సిక్సర్ల వర్షం..
ముఖ్యంగా వినోద్ కోచ్చి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు తన ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, పది సిక్సర్లు బాదాడు. ఇతడి ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. విష్ణు వరుసగా రెండు ఓవర్లలో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. 15వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి, చివరి 3 బంతులను సిక్సర్లుగా మలచిన ఇతడు.. ఆ తర్వాత ఓవర్లో కూడా చివరి మూడు బంతులను మూడు సిక్సర్లు బాదాడు. ఇతడు కెప్టెన్ సచిన్ బేబీతో కలిసి కేవలం 11 ఓవర్లలో 143 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విష్ణు మాత్రమే కాదు సచిన్ కూడా అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. ఇతడు కేవలం 44 బంతుల్లోనే 91 రన్స్ చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్లలో సంజు సామ్సన్ అన్నయ్య సాలీ సామ్సన్ మూడు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
Also Read: Cheteshwar Pujara – క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా నయా వాల్
సంజూ సూపర్ సెంచరీ
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కొచ్చి బ్లూ టైగర్స్ టీమిండియా స్టార్ బ్యాటర్, కొచ్చి కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అతడు 51 బంతుల్లో 121 పరుగుల భారీ స్కోరు సాధించాడు. సంజూ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కొచ్చి ఆటగాడు ముహమ్మద్ ఆషిక్ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో కొచ్చి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: Asia Cup 2025- ఆసియా కప్ కు ముందు టీమిండియాకు షాక్.. ఆస్పత్రిలో స్టార్ ప్లేయర్..!


