Fifa World Cup : మన దేశంలో చాలా మందికి క్రికెట్ అంటే ప్రాణం అన్న సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు వీరభిమానులు ఉన్నారు. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ వంటి స్టార్‌లను అమితంగా ఇష్టపడుతుంటారు. క్రికెట్ మ్యాచ్‌లు చూసినట్లుగానే వీధుల్లో భారీ స్క్రీన్లలో ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. అర్జెంటీనా జట్టు 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ఫిఫా ప్రపంచకప్‌ను అందుకుంది. దీంతో అర్జెంటీనాలో దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
అర్జెంటీనా విజయాన్ని భారత్‌లో కొన్ని చోట్ల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కేరళ రాష్ట్రంలోని థ్రిస్సూర్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంతో హోటల్ యజమాని శిబు అందరి కంటే కాస్త వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అర్జెంటీనా ఫైనల్‌కు చేరడంతో ఎంతో ఆనందించిన అతడు ఫైనల్‌లో అర్జెంటీనా గెలిస్తే 1000 మందికి ఉచితంగా బిర్యానీలు పంచిపెడుతానని మాటిచ్చాడు. ఈ మేరకు ఓ బ్యానర్ కూడా కట్టాడు.
అతడు కోరుకున్నట్లే ఫైనల్‌లో మెస్సీ సేన విజయం సాధించింది. ఇచ్చిన మాట మేరకు బిర్యానీ ఉచితంగా ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. దీంతో అతడి హోటల్ ముందు జనం క్యూ కట్టారు. చాలా మంది రావడంతో మరో 500 బిర్యానీలను అదనంగా పంచాడు. మొత్తంగా 1500 బిర్యానీలు పంచి అందరి చేత ప్రశంసలు పొందాడు. అర్జెంటీనా విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని శిబు అన్నాడు. ఇక బిర్యానీ తిన్న వాళ్లంతా చాలా బాగుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.