Friday, September 20, 2024
HomeఆటKhaleel Ahmed: ఆస్ప‌త్రి బెడ్‌పై భార‌త క్రికెట‌ర్‌

Khaleel Ahmed: ఆస్ప‌త్రి బెడ్‌పై భార‌త క్రికెట‌ర్‌

Khaleel Ahmed : ఆట ఏదైనా కావొచ్చు. ఆడే క్ర‌మంలో ఆట‌గాళ్లు గాయాల పాలు కావ‌డం స‌హ‌జం. కొన్ని సార్లు చిన్న‌, మ‌రికొన్ని సార్లు పెద్ద గాయాలు అవుతుంటాయి. వాటి నుంచి కోలుకుని ఆట‌గాళ్లు పున‌రాగ‌మ‌నం చేస్తుంటారు. అయితే ఒక్కొసారి గాయాల వ‌ల్ల ఆట‌గాళ్లు త‌న కెరీర్‌ను అర్థాంత‌రంగా ముగించాల్సి వ‌స్తుంటుంది. తాజాగా టీమ్ఇండియా క్రికెట‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్ గాయం కార‌ణంగా రంజీట్రోఫీ 2022-23 సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇది అత‌డి కెరీర్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు

- Advertisement -

ఆస్ప‌త్రిలోని బెడ్‌పై తాను ప‌డుకుని ఉన్న ఫోటోల‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి తిరిగి మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు.

‘ఇది నిజంగా దురదృష్టకరం. క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అయినా తప్పడం లేదు. నా ఆరోగ్యం సరిగా లేదు. దీంతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల‌కు దూరం అయ్యా. ప్ర‌స్తుతం కోలుకుంటున్నాను. త్వ‌ర‌లోనే పూర్తి పిట్‌నెస్ సాధించి తిరిగి జ‌ట్టులోకి వ‌స్తాను. నేను కోలుకోవాల‌ని ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు’ అని ఖ‌లీల్ అహ్మ‌ద్ అన్నాడు.

అయితే తాను ఎందుకు ఆస్ప‌త్రిలో చేరాడు అన్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. గ‌త కొంత కాలంగా ఖ‌లీల్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఖ‌లీల్ పోస్ట్ చూసిన అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

2018లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్ భార‌త్‌ తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అత‌డి బౌలింగ్‌లో ప్ర‌త్య‌ర్థులు అవ‌లీల‌గా ప‌రుగులు రాబ‌డుతుండ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయాడు. దీంతో జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత అతడి ప్లేస్‌ను ఖ‌లీల్ భ‌ర్తీ చేస్తాడ‌ని బావించగా నిరాశే ఎదురైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News