రాష్ట్రస్థాయి 9వ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. సారంగ పాణి, డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి, రాష్ట్ర ఉపాధ్య క్షుడు కె.మహీధర్, జిల్లా చైర్మన్ నున్నా రాధాకృష్ణ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు అథ్లెట్లు కృషి చేయాలన్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తో పోటీ పడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఇదేవిధంగా ప్రతిభను మెరుగుపరుచు కుంటే దేశానికి మరిన్ని పతకాలు సాధించొచ్చని చెప్పారు. డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి మాట్లా డుతూ క్రీడాకారులు రాణించేందుకు అనేక అవకాశా లు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ నున్నా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 250మంది పురుషులు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారని తెలిజేసారు. ఈకార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మందుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ గౌస్, పాటు వెంకటేశ్వరెడ్డి, మల్లెంపాటి సత్యనారాయణ, దుర్గ, ఎం.సుధాకర్, చంద్రకళ, కృష్ణయ్య, రవి, నక్కావెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ మీట్లో భాగంగా తొలిరోజు ఈవెంట్లలో గెలుపొందిన వారి వివరాలి లా ఉన్నాయి. పురుషుల 100 మీటర్ల పరుగు పం దెంలో మనే దినేష్(రంగారెడ్డి), ఎస్.కే.లాలాపాషా, చింత నవీన్ కుమార్ (ఖమ్మం), 800 మీటర్ల పరుగు లో వర్సరాజు(భద్రాద్రి కొత్తగూడెం), కుసం రవి (జయశంకర్ భూపాలపల్లి), పి.సందీప్ (హన్మకొం డ), 5వేల మీటర్ల పరుగులో సురభ్ (తెలంగాణ అథ్లె టిక్స్ అకాడమీ-టీఏఏ), ఎం.వినయ్ (కరీంనగర్), వి.ధనుష్(నల్లగొండ), డిస్కస్ త్రోలో అజయ్కుమా ర్ (టీఏఏ), సీహెచ్. ప్రశాంత్ (ఖమ్మం), వి.వ్రికంకు మార్(పెద్దపల్లి), హైజంప్ జె. ఆనారాధన్ (నారా యణపేట), ఎం.పరమేష్(సూర్యాపేట), ఎం.ప్రభాకర్రావు(జయశంకర్ భూపాలపల్లి), ట్రిపుల్ జంప్ లో అభిషేక్ (టీటేఏ), ఎర్రోళ్ల తేజ(మెదక్), బి. అంజి (హన్మకొండ), లాంగ్ జంప్ అభిషేక్ (టీఏఏ), ఎర్రోళ్ల తేజ(మెదక్), జి.జయాకేష్ (భద్రాద్రి కొత్త గూడెం) ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలి చారు. ఇక షాట్పుట్లో షేక్ మజీదా పాషా, షేక్ ఆప్తా బ్(ఖమ్మం) మొదటి రెండు స్థానాలు సాధించారు. అలాగే, మహిళల విభాగం 100 మీటర్ల పరుగులో పి.రామస్వామి (రంగారెడ్డి), బి.రాగవర్షిణి(హైదరా బాద్), ఎం.డీ.సైరాభాను(రంగారెడ్డి), 400 మీటర్ల పరుగులో ఎ.మైథిలి(ఖమ్మం), డి.భార్గవి (కరీంనగ ర్), పి. లిఖిత(ఖమ్మం), 800 మీటర్ల పరుగులో బా నోత్ ఇందుప్రియ, పెండ్ర కామాక్షి(ఖమ్మం), బి.మా నస(నాగర్ కర్నూల్), షాట్పుట్లో హజీరా ఫాతిమా (ఖమ్మం), జి.హిమసింధు (భద్రాద్రి కొత్తగూడెం), జె.నిఖిత(నిర్మల్), హైజంప్ లో జె.రంజిత (కరీంన గర్), పి.ఉమ (నిజామాబాద్), పి.నవ్య(భద్రాద్రి కొత్తగూడెం) మొదటి మూడు స్థానాల్లో నిలి చారు. అలాగే, 5 వేల మీటర్ల పరుగులో కె. విశాలక్ష్మి(హైద రాబాద్), ఎస్.మానస(జగిత్యాల) మొదటి రెండు స్థానాల్లో నిలవగా, డిస్కస్ త్రోలో జి.హిమసింధు (యాదాద్రి భువనగిరి) విజయం సాధించారు.