Sunday, January 5, 2025
HomeఆటKhel Ratna Award: ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం

Khel Ratna Award: ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం

భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను(Khel Ratna Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది.

- Advertisement -

షూటింగ్‌ విభాగంలో మను బాకర్‌(Manu Bhaker), చెస్‌ విభాగంలో డి.గుకేశ్‌(Gukesh Dommaraju), హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(Harmanpreet Singh), పారా అథ్లెట్‌ విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌(Praveen Kumar)లు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.

కాగా అతి పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన ఆటగాడిగా గుకేశ్ నిలవగా.. ఒకే ఒలింపిక్స్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన ప్లేయర్‌గా మను బాకర్ చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. ఇక హర్మన్ ప్రీత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మెడల్ సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించగా.. ప్రవీణ్ కుమార్ పారా ఒలంపిక్స్‌లో పతకం సాధించారు.

ఇక 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలను ప్రకటించింది. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్‌ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News