HomeఆటKhelo India: ఈ నెల 30నుంచి జగదల్‌పూర్‌లో ఖేలో ఇండియా పోటీలు.. విశాఖ నుంచి ఇద్దరు...

Khelo India: ఈ నెల 30నుంచి జగదల్‌పూర్‌లో ఖేలో ఇండియా పోటీలు.. విశాఖ నుంచి ఇద్దరు అధికారులు.!

Khelo India Visakha: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ వేదికగా ఈ నెల 30నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఖేలో ఇండియా పోటీలు జరగనున్నాయి. ఈ తొలి ట్రైబల్ గేమ్స్‌కు ఇప్పటి నుంచే విశేష ఆదరణ లభిస్తున్నట్లు విశాఖపట్నం అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. పృథ్వీరాజ్, ఎం. నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/rahul-ramakrishna-brother-passed-away-due-paraquat-poisoning/

అంతేకాకుండా ఈ పోటీలకు ఏపీ నుంచి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు క్వాలిఫైడ్ టెక్నికల్ అధికారులు హాజరు కానున్నారు. ఎం. నారాయణరావుతో పాటు విశాఖ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలోని అథ్లెటిక్ కోచ్ కె. ఆనంద లక్ష్మి హాజరు కానుండటం జిల్లాకే గర్వకారణమని విశాఖపట్నం అథ్లెటిక్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News