Saturday, November 15, 2025
HomeఆటRed Fort: ప్రత్యేక అతిధులుగా ఖో ఖో ప్రపంచ కప్ విజేతలు

Red Fort: ప్రత్యేక అతిధులుగా ఖో ఖో ప్రపంచ కప్ విజేతలు

New Delhi: భారతదేశపు ప్రాచీన స్థానిక ఆటలలో ఒకటైన ఖో ఖో కి చారిత్రాత్మక గౌరవం లభించింది. చరిత్రలో తొలిసారిగా ఖో ఖో క్రీడలో ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన భారతదేశ పురుషులు, మహిళల బృందాలను 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.

- Advertisement -

2025 జనవరి 13 నుండి 19 వరకు ఖో ఖో ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 6 ఖండాల నుండి 23 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 పురుషుల జట్లు, 19 మహిళల జట్లు ఈ టోర్నీలో తలపడ్డారు. ఈ పోటీలో భారత దేశం నుండి పోటీపడిన మహిళల జట్టు, పురుషుల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

Read more: https://teluguprabha.net/sports-news/wi-vs-pak-2025-3rd-odi-west-indies-end-34-year-wait-with-202-run-victory-against-pakistan-in-tarouba/

ఈ విజయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో ఒక చిహ్నాత్మక గౌరవంగా వీరిని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగే ప్రధాన వేడుకలకు ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ వద్ద దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, సామాజిక నాయకులు తదితర రంగాల నుంచి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరవుతారు.

ప్రపంచ కప్ విజేత మహిళా జట్టు కెప్టెన్ నిర్మలా భాటి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీవీలో మాత్రమే చూశాను. ఇప్పుడు నా జట్టుతో కలిసి అక్కడికి వెళ్లే అవకాశం రావడం ఎంతో గొప్ప అనుభూతి,” అని గర్వంగా చెప్పారు.

Read more: https://teluguprabha.net/sports-news/arjun-tendulkar-engagement-sania-chandhok/

“ఇది మా క్రీడకు గొప్ప గౌరవం. ఈ ఆహ్వానం మా అందరికి గర్వకారణం. మాకు మద్దతుగా నిలిచిన ఖో ఖో ఫెడరేషన్ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్, ఎంఎస్ త్యాగీ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు,” అని పురుషుల బృందం కెప్టెన్ ప్రతీక్ వైకార్ పేర్కొన్నారు.

ఖోఖో ఫెడరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ఈ ఆహ్వానం ఖో ఖో క్రీడకు లభించిన గుర్తింపు మాత్రమే కాదు, భారతదేశ స్థానిక క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకి నిదర్శనం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad