కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆరాధ్య జాతీయ స్థాయిలో జరిగే బ్యాడ్మింటన్ పోటీలకు ఎన్నికైన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాంరెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రెసిడెంట్ కుడుముల కిషోర్ రెడ్డిలు శుక్రవారం కళాశాల విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాంరెడ్డి మాట్లాడుతూ పట్టణానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు డేరంగుల చంద్రమౌళి కూతురు ఆరాధ్య తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చదువుతో పాటు, క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని జాతీయ స్థాయి క్రీడలకు ఆరాధ్య ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఈనెల జనవరి 17,18 తేదీల్లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొన్నివిజయం సాధించాలన్నారు.
బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాణించే విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటామని బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులు కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆరాధ్యను ఎంపిక చేసిన రాష్ట్ర అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేనయ్య ,సదానందం గౌడ్ రమాకాంత్ మల్లేష్ రాజేష్ భీమేష్ లక్ష్మీకాంత్ సాగర్ జుబేర్ బాలరాజ్ పరశురాం లక్ష్మయ్య నర్సింహులు హైమద్ తదితరులు పాల్గొన్నారు.
Kalvakurthi: నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎన్నికైన విద్యార్థిని
ఛాంపియన్