ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 20025(IPL 2025)కు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉంది. మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకు ఈ మహా సంగ్రామం కొనసాగనుంది. మార్చి 22న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడనుంది. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో మూడు సార్లు కప్ కొట్టిన నేపథ్యంలో జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది.
తాజాగా తమ జట్టు కొత్త కెప్టెన్‌ను కూడా ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే(Ajinkya Rahane) సారథిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. వైస్ కెప్టెన్‌గా వెంకటేష్ అయ్యర్‌ను నియమించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు కప్ కొట్టిన విషయం విధితమే. అయితే అతడిని రిటైన్ చేసుకోలేదు. ఇక రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జాయింట్స్ టీమ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.