HomeఆటIPL 2026: BCCI ఆర్డర్‌.. ముస్తాఫిజుర్‌ను తొలగించిన కేకేఆర్‌.. ప్రత్యామ్నాయం వీళ్లేనా.?

IPL 2026: BCCI ఆర్డర్‌.. ముస్తాఫిజుర్‌ను తొలగించిన కేకేఆర్‌.. ప్రత్యామ్నాయం వీళ్లేనా.?

KKR Releases mustafizur rahman: ఐపీఎల్‌- 2026 వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను KKR కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం, బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

- Advertisement -

బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌ యాజమాన్యం బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి తొలగించింది. తాజాగా జరిగిన వేలంలో జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌.. ముస్తాఫిజుర్‌ను వేలంలో రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్‌ను ఎలా కొనుగోలు చేస్తారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. నెట్టింట్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని కేకేఆర్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/uttam-kumar-reddy-presentation-on-krishna-river/

బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను తొలగిస్తున్నట్లు కేకేఆర్‌ యాజమాన్యం ప్రకటించింది. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో అతని స్థానంలో మరే ఇతర ఆటగాడు వస్తాడనే సందేహం క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. రెహమాన్‌ స్థానంలో నిలిచే సామర్థ్యం ఉన్న బౌలర్ల పేర్లను పరిశీలిస్తే.. 

ఫజల్హాక్ ఫారూకి: ఈ ఆఫ్ఘన్ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఫారూకికి బలమైన T20 రికార్డు ఉండగా.. IPLలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. 51.. T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టిన చరిత్ర ఉంది. 

జాషువా లిటిల్: ఐర్లాండ్ ఎడమచేతి వాటం పేసర్ జాషువా లిటిల్ కూడా ఈ రేసులో ఉన్నాడు. 74 T20I మ్యాచ్‌ల్లో 82 వికెట్లు పడగొట్టగా.. SA20, ILT20, CPL వంటి లీగ్‌లలో జాషువాకి అనుభవం ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ స్టైల్‌ బౌలింగ్‌ను ఇతనిలో చూడవచ్చు. 

Also Read: https://teluguprabha.net/international-news/pakistan-tests-taimoor-cruise-missile-600km-range/

స్పెన్సర్ జాన్సన్: ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను రెహమాన్‌ స్థానంలో IPL 2026లో తీసుకునే అవకాశం ఉంది. గతంలో KKR తరపున ఆడిన అనుభవం ఉంది. 

రిచర్డ్ గ్లీసన్: ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ మంచి ఆప్షన్‌. దక్షిణాఫ్రికా లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. SA20 టోర్నమెంట్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News