Thursday, April 17, 2025
HomeఆటKKR vs LSG: దుమ్మురేపిన మార్ష్, పూరన్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్

KKR vs LSG: దుమ్మురేపిన మార్ష్, పూరన్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు అదిరిపోయే శుభారంభం చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్(47) కేకేఆర్ బౌలర్లను చితక్కొట్టారు. ఈ క్రమంలో 10 ఓవర్లకు స్కోరు 95/0గా నమోదైంది. హాఫ్ సెంచరీకి చేరువైన మార్క్రమ్‌ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో ఫోర్ బాది మార్ష్‌ అర్ధ శతకం అందుకున్నాడు.

- Advertisement -

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో మార్ష్ కూడా అదరగొట్టాడు. దీంతో ఈ జంట 11-15 ఓవర్ల మధ్య ఏకంగా 64 పరుగులు రాబట్టింది. దూకుడుగా ఆడుతున్న మార్ష్‌(81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)ను రస్సెల్ పెవిలియన్ పంపించాడు. పూరన్ మాత్రం (87*; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు వచ్చాయి. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News