Asia Cup 2025: ఆసియా కప్ కు కౌంట్ డౌన్ మెుదలైంది. మరో వారం రోజుల్లో మెుదలుకానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ లో ఇప్పటివరకు ఎక్కువ టైటిళ్లు గెలుచుకున్నది టీమిండియానే. ప్రస్తుతం భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. దీంతో ఈసారి కూడా కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా భారత్ కే ఉన్నాయి. అయితే ఈ సారి ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నం కాబోతున్న టీమిండియా బ్యాటర్లు ఎవరో తెలుసా?
కిరాక్ ఓపెనర్
గతేడాది టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అభిషేక్ శర్మ 20 ఓవర్ల క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. చాలా తక్కువ టైంలోనే టీ20 క్రికెట్ లో తనదైన ముద్రవేశాడు. ఆసియా కప్ 2025కు ముందు 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 193.84 స్ట్రైక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతోపాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడు 46 ఫోర్లు, 41 సిక్సర్లు బాదాడు.
తెలుగోడి దూకుడు
తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ టీమిండియా తరపున మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అలవోకగా సిక్సర్లు కొట్టగలడు. ఆసియా కప్ ముందు వరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 155.07 స్ట్రైక్ రేట్‌తో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతను 61 ఫోర్లు, 43 సిక్సర్లు బాదాడు. ఇతడు హైయ్యస్ట్ వ్యక్తిగత స్కోరు 120.
Also Read: Rare Feat-చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..
మిస్టర్ 360
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్టర్ 360గా పిలుచుకునే ఇతడు ఎలాంటి షాట్ నైనా ఆడగలడు. అలవోకగా బౌండరీలు కొట్టడంలో ఇతడు దిట్ట. ఆసియా కప్ ముందు వరకు 83 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 167.07 స్ట్రైక్ రేట్‌తో 2598 పరుగులు చేశాడు. ఇతడు టీ20 కెరీర్ లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ (5), గ్లెన్ మాక్స్‌వెల్ (5) తర్వాత స్థానం ఇతడిదే. సూర్య 146 సిక్సర్లు, 237 ఫోర్లు కొట్టాడు.
Also Read: T20 Record- పొట్టి క్రికెట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ధీరులు వీరే..!


