Saturday, November 15, 2025
HomeఆటAnushka Sharma: కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ‌ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Anushka Sharma: కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ‌ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ రిటైర్మెంట్‌పై మాజీ, తాజా క్రికెట‌ర్ల‌తో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. తాజాగా కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ(Anushka Sharma) కూడా ఇన్‌స్టా వేదిక‌గా స్పందించారు. భ‌ర్త టెస్టుల నుంచి వైదొల‌గ‌డంపై ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు.

- Advertisement -

“అంద‌రూ నీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడూ ఎవ‌రికీ చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని పోరాటాలు, టెస్టు ఫార్మాట్‌పై నువ్వు చూపిన‌ ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు కొంచెం వివేకవంతుడిగా, వినయంగా తిరిగి వచ్చావు. ఏదో ఒకరోజు నువ్వు వైట్ డ్రెస్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతావ‌ని ఊహించా. అందుకే నా ప్రేమను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అద్భుత‌మైన వీడ్కోలును పొందావు” అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad