HomeTop StoriesKKR vs GT: ఫిన్ అలెన్‌ విధ్వంసం.. గుజరాత్‌పై కోలక్‌తా సూపర్‌ విక్టరీ

KKR vs GT: ఫిన్ అలెన్‌ విధ్వంసం.. గుజరాత్‌పై కోలక్‌తా సూపర్‌ విక్టరీ

KKR vs GT IPL 2026: ఐపీఎల్‌- 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. సొంత మైదానంలో పరుగుల సునామీ సృష్టించిన బ్యాటర్లు.. ప్రత్యర్థి జట్టుకు కొండంత లక్ష్యంతో సవాల్‌ విసిరారు. ఆరంభం నుంచి నిలకడగా ఆడినా గుజరాత్‌ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో 29 పరుగుల తేడాతో కేకేఆర్‌ సూపర్ విక్టరీని నమోదు చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/traffic-restrictions-in-uppal/

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరును చేసింది. ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కెప్టెన్ అజింక్యా రహానే(14) విఫలమైనా.. ఫిన్ అలెన్ గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి జట్టు అత్యధిక స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ 82(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు), కామెరాన్ గ్రీన్ 52(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో పాటు అజేయంగా నిలిచారు. వీరిద్దరి దూకుడుతో కేకేఆర్‌ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌, సాయి కిశోర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

Also Read: https://teluguprabha.net/telangana/dk-aruna-satires-on-cm-revanth/

248 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ వికెట్లను కాపాడుకుంటూ వచ్చింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 23 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. నిషాంత్‌ సింధు(1) నిరాశపరిచాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 85(49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు), జాస్‌ బట్లర్‌ 57(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బౌండరీలతో తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కేకేఆర్‌ బౌలర్లు పొదుపైన బౌలింగ్‌తో పరుగుల కట్టడిలో విజయం సాధించారు. సెంచరీకి చేరువలో దూకుడు మీదున్న గిల్‌.. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరగా.. సాయి సుదర్శన్‌ కోలుకుని క్రీజులోకి వచ్చాడు. 28 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇన్నింగ్స్ ముగిసే నాటికి 3 గుజరాత్‌ వికెట్లు కోల్పోయి పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2 వికెట్లు, సౌరభ్‌ దూబే, కామెరాన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News